
- మూడు కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున అందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/ పెంబి, వెలుగు : పెంబి మండలం రాయదారి గ్రామంలో మూడు రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను శనివారం ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. విద్యుదా ఘాతంలో ఇండ్లు దగ్ధమైన కుటుంబాల ఇండ్లను పరిశీలించి, ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, 3 కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షార్ట్ సర్య్కూట్ తో సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
కోరుకంటి తండా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. పెంబి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన పెద్ద మైసమ్మ ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబానికి రూ. పది వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో పెంబి, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వపనీల్ రెడ్డి, దయానంద్, ఖానాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, కాంగ్రెస్ నాయకులు శంకర్, సురేశ్, గోవింద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.