
- రాష్ట్ర టూరిస్టులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా హెల్ఫ్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటకులకు తగిన సహాయం అందిస్తామని, ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. కాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9440816071, 90106 59333, 040 23450368, టూరిజం ఫిర్యాదు నంబర్లు 7032395333, టోల్ ఫ్రీ నంబర్ 180042546464నందు సంప్రదించాలని ఆయన సూచించారు.