వర్షాల బాధితులను ఆదుకోండి.. కలెక్టర్లకు బండి సంజయ్ ఫోన్​

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హన్మకొండ జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ సంజయ్​ గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. 

లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు పడుతోన్న ప్రజలను ఆదుకోవాలని కోరారు. వర్షాల వల్ల పేదలు పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని, నిత్యావసరాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంబంధిత జిల్లాల కలెక్టర్లు తెలిపారు.

ALSO READ:హైదరాబాద్లో సిటీలో లగ్జరీ ఇండ్ల సేల్స్​ జోరు