
న్యూఢిల్లీ, వెలుగు: పహల్గాం టెర్రర్ దాడి నేపథ్యంలో స్టూడెంట్స్ కోసం జమ్మూకశ్మీర్ సర్కార్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు తమ కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకునేందుకు లేదా ఇతర సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. 7303620090, 9682389265, 9419158581, 01124611108, 01124615475, 01124611157, 011246112021, 011246112022లతో పాటు ల్యాండ్ ఫోన్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఢిల్లీలోని జమ్మూకాశ్మీర్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఆఫీసు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.