
తిరువనంతపురం: మళయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు మహిళ యాక్టర్స్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో విజయన్ సర్కార్ విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేష్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. దీంతో లైంగిక వేధింపులకు గురైన పలువురు నటులు ముందుకు వచ్చి సిట్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.
తాజాగా సీనియర్ నటీ సోనియా మల్హార్ సిట్‌కు కంప్లైంట్ చేసింది. 2013లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఓ యువ నటుడు తనను వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రెస్ట్ రూమ్ నుండి బయటకు వస్తుండగా అతడు తనను వెనక నుండి గట్టి హగ్ చేసుకున్నాడని.. ఈ ఊహించని పరిణామంతో తాను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయ్యానని తెలిపారు. నా రియాక్షన్‌ను చూసి అతడు నాకు వెంటనే క్షమాపణ చెప్పినప్పటికీ.. తాను భయాందోళనకు గురి అయ్యాయన్నారు.
అయితే, తాను చేసిన ఈ ఆరోపణలను తమిళ నటుడు జయసూర్యను లింక్ చేయవద్దని ఆమె మీడియాను కోరారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటి వరకు సిట్‌కు 17 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొందరు యాక్టర్స్‌కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.