ములుగు జిల్లాలో జనవరి 15న హేమాచలుడి వరపూజ

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివార్లలోని హేమాచల నృసింహస్వామి వరపూజ కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెంట్‌‌ను ఆదివారం చైర్మన్‌‌ నూతనకంటి ముకుందం, అర్చకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని మల్లూరులోని సంక్రాంతి మండపం

వద్ద ప్రతిఏటా స్వామి వారి మహా వరపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సారి నిర్వహించే కార్యక్రమానికి మంత్రి సీతక్కను ఆహ్వానించామన్నారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మల్లూరు గ్రామానికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాజశేఖర్‌‌శర్మ, రాఘవాచార్యులు, పవన్‌‌కుమారాచార్యులు, ఈశ్వర్‌‌ చంద్‌‌ పాల్గొన్నారు.