- ఆన్ లైన్లో ఇండెంట్స్ పంపితే వెంటనే సరఫరా చేస్తాం
మహబూబాబాద్,వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ సహదేవరావు బోర్కడే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తుందని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హస్పిటల్‌ను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఆస్పత్రుల్లోని మెడిసిన్ స్టాక్‌ను పరిశీలించి ఆన్ లైన్‌ద్వారా స్టాక్ ఇండెంట్ ను పంపించినట్లైతే సరఫరా చేస్తామని తెలిపారు. ఈ –- ఔషధీ పోర్టల్ లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. అడిషనల్కలెక్టర్లెనిన్ వత్సల్టొప్పొ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ జి. మురళీధర్, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వర్ , సబ్ డివిజనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటకృష్ణ, విద్యాసాగర్, జిల్లా ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గఫార్, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.