రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ( నవంబర్ 28) రాంచీలోని మొరహాబాద్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.. హేమంత్ సోరేన్ తో ప్రమాణం చేయించారు.
अबुआ सरकार का शपथ ग्रहण समारोह…
— Hemant Soren (@HemantSorenJMM) November 28, 2024
जय झारखण्ड!
जय जय झारखण्ड! https://t.co/7uPQnxY8Cd
హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్స నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్,కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలున్న జార్ఖండ్ లో JMM నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇండియా కూటమి నేతృత్వంలో 56 స్థానాలను కైవసం చేసుకుంది. NDA 24 స్థానాలతో కైవసం చేసుకుంది. హేమంత్ సోరెన్ 39,791 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌ను ఓడించి బర్ హైత్ సెగ్మెంట్ ను గెలుచుకున్నారు.