
- తేల్చిచెప్పిన జార్ఖండ్ సీఎం హేమంత్
రాంచీ: బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. రాష్ట్రంలో యూసీసీనిగానీ, ఎన్ఆర్సీనిగానీ అనుమతించబోమని తేల్చిచెప్పారు. గిరిజన సంస్కృతి, భూమి, హక్కులను పరిరక్షించేందుకు చోటానాగ్పూర్ టెనెన్సీ(సీఎన్టీ), సంతాల్ పరగణా టెనెన్సీ(ఎస్పీటీ) చట్టాలకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుందని సోరెన్ చెప్పారు.
“ఈ వ్యక్తులు (బీజేపీ) విషాన్ని చిమ్ముతున్నారు. గిరిజనులు, స్థానికులు, దళితులు, వెనుకబడిన తరగతులవారిని వీరు పట్టించుకోరు” అని విమర్శించారు. ఆదివారం గర్వాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సోరెన్ మాట్లాడారు. జేఎఎం నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నక్సలిజానికి ఆజ్యంపోస్తున్నదని అమిత్ షా చేసిన కామెంట్స్‌పై సోరెన్ స్పందించారు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేవారని, ప్రస్తుతం రెండు విడతల్లోనే పూర్తి చేస్తున్నారని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో నక్సలిజం తగ్గిందనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.