జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్

జార్ఖండ్‌ 13వ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ సీవీ రాధాకృష్ణన్‌ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ జార్ఖండ్‌ ఇన్‌చార్జి గులాం అహ్మద్‌ మీర్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్, భార్య కల్పనా సోరెన్ సమావేశానికి హాజరయ్యారు. జార్ఖండ్‌లో మహాకూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ముఖ్యమంత్రి సోరెన్ అన్నారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. 

చంపై సోరెన్‌ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత హేమంత్‌ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. సోరెన్‌ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్‌ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది. సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్‌ ఇకపై కోఆర్డినేషన్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు. నిన్న జరిగిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా సమావేశంలో శాసనసభాపక్ష నేతగా హేమంత్‌ సోరెన్‌ను నియమించాలని నిర్ణయించారు.