జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!

జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!

 జార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్ రిజైన్ చేశారు. గతంలో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్​ను ఈడీ అరెస్టు చేయడంతో చంపయీ  సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.  ప్రస్తుతం హేమంత్ సోరెన్ బెయిల్​పై వచ్చారు. దీంతో హేమంత్ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు.

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ రిజైన్ చేశారు. బుధవారం తన రాజీనామా లెటర్ ను గవర్నర్ రాధాకృష్ణన్ కు అందించారు. ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న అప్పటి సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో చంపాయి  సోరెన్ ఆ బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేయడంతో హేమంత్ సోరెన్  జైలు నుంచి విడుదలయ్యారు. 

ఈ నేపథ్యంలో చంపాయి సోరెన్ నివాసంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలంతా బుధవారం సమావేశమయ్యారు. హేమంత్ సోరెన్ ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాంతో హేమంత్ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం చంపాయి సోరెన్ రిజైన్ చేశారు. రాజ్ భవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. జేఎంఎం కూటమి తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ కూటమి బలంగా ఉందని చెప్పారు.