జార్ఖండ్ అసెంబ్లీ 2024 ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీ ఘనం విజయం సాధించింది. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. సీఎంగా నాలుగో సారి హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నవంబర్ 26న హేమంత్ సోరేన్ సీఎంగా ఓత్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈరోజు(ఆదివారం (నవంబర్ 24) )సాయంత్రం 4 గంటలకు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన కోరనున్నారు. మంగళవారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్ వంటి ఇండియా కూటమి పెద్దలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో JMM నేతృత్వంలోని కూటమి విజయం సాధించడం ద్వారా సోరెన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమైంది.జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), సీపీఐ-ఎంఎల్‌లతో కూడిన కూటమి 81 స్థానాల్లో 56 సీట్లు గెలుచుకుంది.
జేఎంఎంకు 34సీట్లు, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్ 2 సీట్లు సాధించడంతో ఇండియా కూటమి కూటమికి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
మరోవైపు తన BJP ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 21 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2000లో జార్ఖండ్ ఏర్పడిన తర్వాత బీజేపీ చెత్త ప్రదర్శనలలో ఇది ఒకటి.