హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2025 ప్రకారం ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. 2024లో 80వ స్థానంలో ఉండగా ఐదు పాయింట్లు దిగజారింది.
అగ్రస్థానంలో ఉన్న దేశాలు: సింగపూర్ (వరుసగా రెండోసారి), రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణకొరియా నాలుగో స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అయిదో స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. భారత పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరుసుగా 103, 101 స్థానాల్లో నిలిచాయి.
2006 నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల ర్యాంకింగ్‌ను ప్రతీ సంవత్సరం విడుదల చేస్తున్నది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా ఒక దేశంలోని ప్రజలు అనేక దేశాలకు ప్రయాణించడం ఎంత సులభమో తెలుపుతుంది.