Henry Hunt: ముక్కులో నుంచి రక్తం.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆస్ట్రేలియా ఆటగాడు

Henry Hunt: ముక్కులో నుంచి రక్తం.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆస్ట్రేలియా ఆటగాడు

క్రికెట్ లో బంతి తగిలి గాయపడటం చాలా అరుదుగా చూస్తాము. ఒకవేళ గాయపడినా.. బ్యాటర్ లేదా బౌలర్ గాయపడతారు. బౌన్సర్ ఆడే క్రమంలో టైమింగ్ మిస్ అయినప్పుడు బ్యాటర్ కు తీవ్ర గాయం అవుతుంది. మరో సందర్భంలో బ్యాటర్ వేగంగా బౌలర్ మీదుగా షాట్ ఆడినప్పుడు బంతి తగిలి బౌలర్ గాయపడటం చూస్తాం. అయితే తాజాగా బంతి తగిలి ఫీల్డర్ గాయపడ్డాడు. బలంగా ముక్కుకు తాకడంతో రక్తం కూడా వచ్చింది.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం మార్ష్ కప్ జరుగుతుంది. విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విక్టోరియా ఇన్నింగ్స్​ 25వ ఓవర్​లో స్పిన్నర్ పోప్ బౌలింగ్ లో రోడ్రిగ్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హంట్ దాన్ని అందుకునేందుకు డైవ్ చేశాడు. ఫోర్ ఆపే క్రమంలో బంతి అతని చేతుల్లోంచి జారీ ముక్కుకు బలంగా తగిలింది. రక్త స్రావం ఎక్కువవడంతో హంట్ నొప్పితో విలవిల్లాడాడు. ఒక్కసారిగా గ్రౌండ్ లో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు భయపడిపోయారు.      

 ఫిజియో, సపోర్ట్ స్టాఫ్​ అక్కడికి వెంటనే వచ్చి డ్రెస్సింగ్ రూమ్​కు తీసుకెళ్లారు. అతడు ఫీల్డింగ్ చేసిన ప్లేసులో రక్తం కారడంతో గ్రౌండ్ స్టాఫ్​ అక్కడికి వచ్చి క్లీనింగ్ చేశారు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యుజ్ రాకాసి బౌన్సర్ తో ప్రాణాలతో పోరాడిన సంగతి తెలిసిందే. 2014లో ఈ చేదు సంఘటన జరిగింది. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా పేసర్ షమారి జోసెఫ్ వేసిన బంతి ఉస్మాన్ ఖవాజాకు తగలడంతో మైదానాన్ని వీడాడు. హంట్ త్వరగా రికవర్ అవ్వాలని.. చాలా స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.