భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్

నెక్కొండ, వెలుగు: వరంగల్​జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్​చేసుకుంది. ఎస్సై షేక్ జాన్​పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలం మూడుతండాల పంచాయతీ పరిధిలోని మంగళితండాకు చెందిన భూక్య వెంకన్న, జ్యోతి కూతురు రాజేశ్వరి(20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వాకుండోతు రమేశ్​కు ఇచ్చి ఏడాది కింద పెండ్లి చేశారు. ఆ టైంలో కట్నం కింద రూ.10 లక్షల క్యాష్, 5 తులాల బంగారం ఇచ్చారు. అయితే కొన్నాళ్లుగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని రమేశ్ భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల కింద రమేశ్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధించి కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ రమేశ్​తరచూ భార్యకు ఫోన్​ చేసి బూతులు తిడుతున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి సూసైడ్​ చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.