ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిది

ఈ టీ ఆరోగ్యానికి  చాలా మంచిది

హెర్బల్‌‌ టీ తాగితే వచ్చే హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ చాలా ఎక్కువ. బాడీని డీటాక్సిఫై చేస్తూ తగిన ఎనర్జీని అందిస్తాయి. అందుకే ఎప్పుడూ కెఫిన్‌‌ ఉండే రెగ్యులర్‌‌‌‌ టీలు మాత్రమే కాకుండా, హెర్బల్‌‌ టీ కూడా ట్రై చేయాలి. హెర్బల్‌‌ టీలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఈమధ్య ట్రెండ్‌‌ అవుతోంది ‘సీసీఎఫ్​ టీ’. జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలతో తయారు చేసే టీ ఇది. చాలా సింపుల్‌‌గా తయారు చేసుకోవచ్చు. ఈ టీవల్ల డైజెస్టివ్‌‌ సిస్టమ్‌‌ బాగా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కణజాలాల నుంచి విష పదార్థాలు దూరమవుతాయి. మూత్రసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. నెలసరి ప్రాబ్లమ్స్‌‌ కూడా తగ్గుతాయి. వేడి, గ్యాస్‌‌ వంటివి కూడా దూరమవుతాయి. ఆయుర్వేదంలో చెప్పే కఫ, వాత, పిత్త దోషాలను ఈ టీ తొలగిస్తుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు, తేన్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ టీని రోజూ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

తయారీకి కావాల్సినవి

జీలకర్ర: ఒక టీ స్పూన్‌‌
ధనియాలు: ఒక టీ స్పూన్‌‌
సోంపు: : ఒక టీ స్పూన్‌‌
నీళ్లు: లీటర్
తయారీ: ఒక గిన్నెలో లీటర్ నీళ్లు వేడిచేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే జీలకర్ర, ధనియాలు, సోంపు వేసి ఉడికించాలి. కనీసం ఎనిమిది నిమిషాలు మరిగించాక వడకట్టాలి. టీ కెటిల్‌‌లో పోసుకుని రోజులో కనీసం 2 సార్లు తాగొచ్చు. వేడివేడిగా తాగితేనే బాగుంటుంది.