ఎనర్జీ ఫుడ్ తింటున్నారా లేదా ?

ఎనర్జీ ఫుడ్ తింటున్నారా లేదా ?

ఫిట్​నెస్​ కోసం వర్కవుట్లు చేసేవాళ్లు ఎనర్జీ ఫుడ్​ తినాలి. ఆకలిని తగ్గించడంతో పాటు అలసటని పోగొట్టే హెల్దీ శ్నాక్స్ వీళ్లకి చాలా అవసరం. అలాంటి శ్నాక్స్ తింటే శక్తితో పాటు శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్​ కూడా అందుతాయి. అంతేకాదు  కండరాల అలసట మాయమైతుంది అంటున్నాడు ‘స్టేడ్​​ఫాస్ట్​ న్యూట్రిషన్​’ ఫౌండర్​ అమన్​ పురి.

అరటిపండు
కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే అరటిపండు వెంటనే శక్తినిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాల అలసట తగ్గిస్తుంది. అయితే, ఎక్సర్​సైజ్​ చేయడానికి 30 నిమిషాల ముందు అరటిపండు తినాలి. 

ఓట్​మీల్​ పారిడ్జ్​
ఓట్స్​లో సాల్యుబుల్​ డైటరీ ఫైబర్ బీటా–గ్లూకాన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్​ని రిలీజ్​ చేస్తూ ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా చూస్తుంది. ఓట్స్​ని నీళ్లు లేదంటే పాలతో కలిపి తినొచ్చు. ప్రొటీన్​ పౌడర్​, నట్స్, కిస్మిస్​తో కలిపి తింటే ఎక్కువ పోషకాలు అందుతాయి. 

చిలగడదుంప (గెనుసు గడ్డ)
వర్కవుట్​కి ముందు తినాల్సిన పర్ఫెక్ట్​ శ్నాక్​ గెనుసగడ్డ. ఇది వంట్లో ఎనర్జీ లెవల్స్​ తగ్గకుండా చూస్తుంది. ఎ, సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తాయి.  ఫ్రీ రాడికల్స్​ డ్యామేజీని తగ్గిస్తుంది కూడా.  

పీనట్​ బటర్
ఇందులో ప్రొటీన్లు, మంచి ఫ్యాట్ ఉంటుంది. వర్కవుట్​ సెషన్​కి అరగంట ముందు పీనట్​ బటర్​ శాండ్​విచ్​ తినాలి. రకరకాల ధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ మీద పీనట్ బటర్​ రాసుకుని, చియా, అవిసె గింజలు చల్లుకుని కూడా తినొచ్చు. 

గుడ్లు
ఉడకబెట్టిన గుడ్డు కూడా హెల్దీ శ్నాక్. గుడ్డులో  ఎ, బి 12 విటమిన్లు, ఐరన్, ఫోలేట్, కొలిన్​ వంటి పోషకాలు ఉంటాయి. ఉడికించిన గుడ్డు టోర్టిల్లా ర్యాప్స్ తింటే కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. 
ఫ్రూట్​ స్మూతీలు 
యమ్మీగా ఉండే ఫ్రూట్​ స్మూతీల్లో పోషకాలు బోలెడు లభిస్తాయి. పెరుగులో పండ్ల ముక్కలు వేసుకుని తింటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయి.