జియోలో వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది.. 90 రోజులు ఫుల్లు పండగ..!

జియోలో వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది.. 90 రోజులు ఫుల్లు పండగ..!

జియో హాట్ స్టార్లో కంటెంట్ వీక్షించే ప్రేక్షకులు, ఐపీఎల్ అభిమానుల కోసం రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. 100 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 5జీబీ హై స్పీడ్ డేటాతో పాటు 90 రోజుల పాటు జియో హాట్స్టార్ కంటెంట్ వీక్షించవచ్చు. క్రికెట్ లవర్స్కు, ఐపీఎల్ అభిమానులకు ఇంతకు మించిన చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ఉండదేమో. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం జియో హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ తో పాటు 5జీబీ హై స్పీడ్ డేటాను మాత్రమే అందిస్తుంది. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు ఈ వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ లో ఉండవు.

ఈ రీఛార్జ్ ప్లాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఏక కాలంలో స్మార్ట్ ఫోన్స్లో, స్మార్ట్ టీవీల్లో 1080 పిక్సెల్ రిజల్యూషన్లో జియో హాట్ స్టార్ కంటెంట్ వీక్షించే అవకాశం ఈ ప్లాన్లో ఉంది. ఇది కేవలం డేటా ఓన్లీ విత్ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్. ఐపీఎల్ 2025 క్రికెట్ మ్యాచులతో పాటు హాట్ స్టార్ కంటెంట్ మొత్తాన్ని హై క్వాలిటీలో వీక్షించవచ్చు. జియో రెండు డేటా ప్లాన్స్ వ్యాలిడిటీలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

69 రూపాయలు, 139 రూపాయల డేటా యాడ్-ఆన్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఇప్పటివరకూ మన ప్రస్తుత ప్లాన్ గడువు ఉన్నంత వరకూ ఉండేది. కానీ.. ఇకపై అలా కాదు.. మీ ప్రస్తుత ప్లాన్ గడువు సంవత్సరం ఉన్నా 69 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీకి సంబంధం లేదు. 69 రూపాయల డేటా ఓన్లీ ప్యాక్ను రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే. 6 జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు.

Also Read:-దేశంలో 118 కోట్లకు చేరిన టెలిఫోన్ యూజర్లు..

139 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 12 జీబీ డేటా.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 7 రోజులు మాత్రమే. ఇవి రెండూ డేటా ఓన్లీ ప్యాక్స్ మాత్రమే. ఎలాంటి వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెన్ఫిట్స్ రావు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్.. జియోహాట్ స్టార్గా మారాక జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటైల్స్:
* 3 నెలలకు 149 రూపాయలు
* సంవత్సరం ప్లాన్ 499 రూపాయలు
* ఒక మొబైల్ డివైజ్కు మాత్రమే
* మొబైల్ ఓన్లీ
* విత్ యాడ్స్
* హెచ్ డీ 720 పిక్సెల్

 

జియో హాట్ స్టార్ సూపర్ ప్లాన్ డీటైల్స్:
* 2 డివైజెస్లకు అనుమతి (టీవీ, ల్యాప్టాప్ లేదా మొబైల్)
* 3 నెలలకు 299 రూపాయలు
* ఏడాది ప్లాన్ 899 రూపాయలు
* విత్ యాడ్స్
* ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ క్వాలిటీ 1080 పిక్సెల్
* Dolby Atmos

 

జియో హాట్ స్టార్ ప్రీమియమ్ ప్లాన్ డీటైల్స్:
* 3 నెలలకు 499 రూపాయలు
* సంవత్సరానికి 1499 రూపాయలు
* 4 డివైజెస్లకు అనుమతి (టీవీ, ల్యాప్ టాప్, మొబైల్)
* లైవ్ ప్రసారాలకు తప్ప మిగతా కంటెంట్కు నో యాడ్స్ (ఒక్క యాడ్ కూడా రాకుండా కంటెంట్ను వీక్షించవచ్చు)
* 4K 2160p + Dolby Vision క్వాలిటీతో కంటెంట్ను ఆస్వాదించవచ్చు
* Dolby Atmos