దసరా, దీపావళి.. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలగా ప్రసిద్ధి. ఇది చాలా మంది ఇండియన్లకు బహుమతుల సీజన్. ఈ సీజన్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి రూ.12వేలలోపు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు పలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫారమ్స్ లో అందుబాటులో ఉన్నాయి. 5G కెపాసిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.
రియల్ మీ నార్జో N53
మొదటి స్టాండ్-అవుట్ చాయిస్ Realme Narzo N53. ఇది రూ. 7,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది రూ.12వేల లోపు బడ్జెట్‌లో వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తోంది. ఇది ఫ్లూయిడ్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల గేమింగ్ డిస్‌ప్లేను, 50MP AI కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది అమెజింగ్ ఫొటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆక్టా-కోర్ UNISOC T612 ప్రాసెసర్‌తో, 33W SUPERVOOC ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ పని చేయనుంది. నార్జో N53 ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీన్నిrealme.com, Amazon.inలో కొనుగోలు చేయవచ్చు.
- 4GB + 64GB, అసలు ధర రూ. 8,999, ఇప్పుడు రూ. 7,999కి అందుబాటులో ఉంది
- 6GB + 128GB స్టోరేజీ గల స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999, ప్రస్తుతం ధర రూ. 9,499.
మోటోరొలా మోటో G14
Moto G14, 4GB RAM + 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఇది రూ. 10,000 లోపు ధర కలిగిన మరొక గొప్ప స్మార్ట్‌ఫోన్. 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, దీర్ఘకాల పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ UNISOC T616 ప్రాసెసర్, 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. ఇది క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 50MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. మోటో G14 నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 12,999 కాగా ఇప్పుడు రూ. 8,499కే లభిస్తుంది. దీన్ని Motorola.in, ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
రియల్ మీ నార్జో 60x 5G
Realme Narzo 60x 5G ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఇది 6.72-అంగుళాల డైనమిక్ అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది నెబ్యులా పర్పుల్, ఆకుపచ్చ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.
- 4GB RAM + 128GB స్టోరేజీతో అసలు ధర రూ. 12,999 కాగా.. ఇప్పుడు రూ. 11,499కి అందుబాటులో ఉంది
- 6GB RAM + 128GB స్టోరేజ్ తో అసలు ధర రూ.14,499, కాగా ఇప్పుడు ధర రూ.11,749గా ఉంది.
ఈ ఫోన్ realme.com, Amazon.inలో అందుబాటులో ఉంది.
రెడ్ మీ 12 5G
Redmi 12 5G 18W ఫాసీ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ ప్రూఫ్ IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. 50MP + 2MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది మూడు డిజైన్ లలో, రంగుల్లో అందుబాటులో ఉంది. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది:
- 4GB RAM + 128GB స్టోరేజీ ఉన్న ఫోన్ అసలు ధర రూ. 15,999 కాగా ఇప్పుడు రూ. 11,999కి అందుబాటులో ఉంది
- 6GB RAM + 128GB స్టోరేజీ ఉన్న ఫోన్ అసలు ధర రూ. 17,999, ఇప్పుడు ధర రూ. 13,499గా ఉంది.
- 8GB RAM + 256GB స్టోరేజీ ఉన్న ఫోన్ అసలు ధర రూ. 19,999, ఇప్పుడు ధర రూ. 14,999గా ఉంది.
Redmi 12 5G అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, mi.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
సామ్ సంగ్ గెలాక్సీ M14 5G
Galaxy M14 5G 6.6-అంగుళాల పూర్తి HD+ గొరిల్లా గ్లాస్ 5, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేయనుండగా.. డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా, 13 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Galaxy M14 5G మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
- 4GB RAM + 128GB స్టోరేజ్ తో వచ్చే దీని ధర రూ. 11,990 (అసలు ధర రూ. 17,990)
- 6GB RAM + 128GB స్టోరేజ్ తో ఉండే ఈ ఫోన్ ధర రూ. 12,990 (అసలు ధర రూ. 18,990)
ఇది Samsung.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది.