Airtel, Jio, Vi: మాకు కాల్స్ ఒక్కటి చాలు డేటా పెద్దగా అక్కర్లేదనుకుంటే ఇటో లుక్కేయండి..

Airtel, Jio, Vi: మాకు కాల్స్ ఒక్కటి చాలు డేటా పెద్దగా అక్కర్లేదనుకుంటే ఇటో లుక్కేయండి..

భారత్‌లో ఇటీవల మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరల పెంపు యూజర్లపై భారం మోపింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. టారిఫ్ పెంచిన తర్వాత కూడా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే రీఛార్జ్ ప్లాన్ల ధరలు తక్కువట. మన దేశంలో జియో, ఎయిర్టెల్, వీఐ యూజర్లు ఎక్కువ మంది ఉన్నారు. టెలికాం సేవలు పొందుతున్న  ప్రీపెయిడ్ కస్టమర్లలో చాలా మంది నెల వారీ రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకుంటుంటారు. అలా ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే యూజర్ల కోసం ధరల పెంపు అనంతరం జియో, ఎయిర్ టెల్, వీఐ ఎంతలో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచిందో ఓ లుక్కేద్దాం.

జియో హీరో 5జీ ప్లాన్:

349 రూపాయల ధరతో జియో హీరో 5జీ ప్లాన్ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో, రోజుకు 2జీబీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లకు జియో అందిస్తోంది. అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందే వెసులుబాటు కూడా ఈ ప్లాన్‌లో ఉంది. జియోలో 399, 449 రూపాయల మంత్లీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ 4జీ డేటా, 449 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ 4జీ డేటా పొందొచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్ ఉండనే ఉన్నాయి. లేదు.. మాకు డేటాతో పెద్దగా పనిలేదు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాత్రమే చాలంటారా.. 189 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుని 28 రోజులకు గానూ 2 జీబీ డేటా పొంది, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించొచ్చు.

వీఐ రూ.349 ప్లాన్:

వీఐ యూజర్లకు ప్రస్తుతం 349 రూపాయల ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ను 28 రోజుల వరకూ ఆస్వాదించొచ్చు. కాంప్లిమెంటరీగా రీఛార్జ్ చేసుకున్న మొదటి మూడు రోజుల వరకూ 3 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 299 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటును వీఐ కల్పించింది. వ్యాలిడిటీ 28 రోజులు.

ఎయిర్టెల్ రూ.379 ప్లాన్:

ఎయిర్ టెల్లో అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించాలంటే నెలకు 379 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రోజుకు 2 జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ల పొందుతారు. జియో మంత్లీ ప్లాన్‌కు, ఎయిర్టెల్ మంత్లీ ప్లాన్‌కు ఉన్న తేడా ఏంటంటే.. జియో ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఎయిర్ టెల్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అంటే.. ఎయిర్ టెల్ మంత్లీ ప్లాన్ అయితే సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అదే.. జియో హీరో 5జీ ప్లాన్ అయితే సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ లో ఇతర మంత్లీ ప్లాన్స్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి. 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటా లభిస్తుంది. 219 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 3జీబీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను 30 రోజుల వరకూ ఆస్వాదించవచ్చు.