యాక్సియోమ్–4 మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాసా మాజీ ఆస్ట్రోనాట్పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనుండగా పైలట్గా శుభాన్షు శుక్లా వ్యవహరించనున్నారు. యాక్సియోమ్–4కు ఎంపికైన వ్యోమగాములు పెగ్గీ విట్సన్(అమెరికా), శుభాన్షు శుక్లా(ఇండియా), ఉజ్నాన్ స్కీ(పోలెలండ్), టిబోర్ కపూ(హంగేరీ)లు ఐఎస్ఎస్కు చేరుకుని అక్కడ రెండు వారాలపాటు పరిశోధనలు చేసి భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భాగస్వామిగా ఉన్నది.
యాక్సియోమ్మిషన్–4లో భాగంగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ఇస్రో ఆస్ట్రోనాట్శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెడితే ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారతీయుడిగానూ రోదసిలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. ఇస్రో చేపట్టబోయే మావనసహిత అంతరిక్ష మిషన్(గగన్‌యాన్)కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా ఒకరు. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ 2004లో చేపట్టిన న్యూషెపర్డ్(ఎన్ఎస్–25) మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోపిచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు.
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యక్తులు:
* 1984, ఏప్రిల్‌లో రష్యా వ్యోమనౌక సోయాజ్టి–11లో అంతరిక్షంలోకి వెళ్లి తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించారు.
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా కల్పనా చావ్లా చర్రిలో నిలిచారు.
* సునీతా విలియమ్స్(2012, 2024) ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు.
* సబార్బిటల్ ఫ్లైట్‌లో ప్రయాణించిన తొలి ఇండియన్ అమెరికన్ స్పేస్ టూరిస్ట్‌గా, రోదసీలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళగా బండ్ల శిరీష రికార్డు సృష్టించారు.
* రాజాచారి (2021), ఆండీ సాద్వని(2024)లో అంతరిక్షంలోకి వెళ్లారు.