ఆధార్ కార్డు నా దగ్గరే ఉంది కదా.. సిమ్(SIM) కార్డు వేరే వాళ్లు ఎలా తీసుకోగలరు అనుకోకండి.. ఇప్పుడంతా హైటెక్ ప్రపంచం. ఏమైనా జరగొచ్చు. ఓ 200 రూపాయలు వెచ్చిస్తే ఆధార్ కార్డే కాదు.. పాన్ కార్డు సైతం చేతిలో పడుతున్నారు. ఇక సిమ్ కార్డు ఎంత. పొరపాటున మీ పేరుపై ఉన్న సిమ్ అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే.. ఎంత ప్రమాదమో గ్రహించండి. ఇప్పుడే మీ ఆధార్ నంబర్‌పై ఉన్న సిమ్ కార్డులు ఏవనేది తెలుసుకోండి. మీకు తెలియకుండా తీసుకున్నవి, అవసరం లేనివి ఉంటే వెంటనే పిర్యాదు చేయండి.
భారత ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో పోయిన స్మార్ట్‌ఫోన్‌లను ట్రాక్ చేయడం, ఆధార్‌తో లింక్ చేయబడిన క్రియాశీల SIM కార్డ్‌లను గుర్తించడం వంటివి ఉన్నాయి. అందుకోసం ఈ కింది ఈ దశలను అనుసరించండి..
- మొదట సంచార్ సాథీ అధికారిక పోర్టల్ https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఇప్పుడు హోమ్ పేజీ పైభాగంలో కనిపిస్తున్న Citizen Centric Services అనే ఆప్షన్ ఎంచుకోండి.
- అనంతరం అక్కడ ఉన్న ఆప్షన్లలో Know Mobile Connections (TAFCOP) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్(Mobile number), క్యాప్చా ఎంటర్ చేయగానే.. మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు OTP పంపబడుతుంది. దానిని ఎంటర్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్‌పై తీసుకున్న సిమ్ కార్డుల జాబితా డిస్ ప్లే అవుతుంది.
- వాటిలో మీకు తెలియకుండా తీసుకున్నవి, అవసరం లేనివి ఉంటే వెంటనే పిర్యాదు(Report) చేయండి.