చిరు బర్త్ డేను సెలబ్రేట్ చేసిన చరణ్

చిరు బర్త్ డేను సెలబ్రేట్ చేసిన చరణ్

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన బర్త్ డేను మెగా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ చెబుతున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన త్రండ్రి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉజ్వల్ రెడ్డి అనే చిరు ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఇందులో చిరుతో పాటు రామ్ చరణ్ ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

ఇక ప్రస్తుతం చిరు పలు మూవీలతో బిజీగా ఉన్నారు. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ తో భోళశంకర్, మరోవైపు డైరెక్టర్ బాబీతో ఓ మూవీ చేస్తున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా నిన్న గాడ్ ఫాదర్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 

అలాగే నిన్న భోళా శంకర్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు తన స్టైలిష్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రిలీజ్ డేట్ ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. వచ్చే ఏడాది అంటే 2023, ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ప్రకటించారు.