బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.
Also Read :- నేను ఎవరి జోలికి వెళ్లను..భయంతో కాదు..రణరంగం మారణహోమంలా మారుతుందని
అయితే ఈ సినిమాపై రణ్బీర్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అందుకే యానిమల్ కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ పెంచేందుకు తన రెమ్యునరేషన్ లో నుంచి సగం డబ్బులు తిరిగిచ్చేశాడట. మూవీ హిట్ అయ్యాక లాభాల నుండి షేర్ తీసుకుంటానని చెప్పడట. ఒకవేళ సినిమా హిట్ అవకపోతే మాత్రం ఆ డబ్బు పోయినట్లే. నిజానికి ఒక హీరో తన సినిమా క్వాలిటీ విషయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే.. ఆ సినిమాపై ఆయనకున్న నమ్మకమే అని క్లియర్ గా అర్థమవుతోంది. మరి రణ్బీర్ తీసుకున్న ఈ డెసిషన్ అతనికి లాభాలు తెచ్చుపెడుతుందా? లేక నష్టాలను మిగుల్చుతుంది అనేది చూడాలి.