
ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. అవికాగోర్ హీరోయిన్. షణ్ముగం సాప్పని దర్శకుడు. తులసీరామ్ సాప్పని, రమేష్ యాదవ్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. మార్చి 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో ఆది మాట్లాడుతూ ‘ఏడాది తర్వాత ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఇప్పటికే ఈ మూవీ అన్నిభాషల డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడం హ్యపీగా ఉంది.
కంటెంట్ బాగున్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈసినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. ఇది తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమని హీరోయిన్ అవికాగోర్ చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో ఆది పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో తీశాం. ఫ్యామిలీతో చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది’ అని చెప్పాడు. నటుడు మనోజ్ నందం, విలన్‌గా నటించిన చిరాగ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.