యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) కుమార్తె, కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) పెళ్లిపీటలెక్కనుంది. తమిళ కమెడియన్ తంబి రామయ్య(Thambi Ramayya) కొడుకు ఉమాపతి(Umapathi)తో ఐశ్వర్య ప్రేమలో ఉందని ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి.దీంతో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఐశ్వర్య అర్జున్ కి హీరో ఉమాపతితో ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇరువురి పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న ఈ జంట త్వరలో ఒక్కటవ్వబోతున్నారు. ఈ వేడుకకు పలువురు కోలీవుడ్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ ఇద్దరు కుమార్తెల్లో ఐశ్వర్య పెద్దమ్మాయి. ఐశ్వర్య అర్జున్ 2013లో నటిగా అరంగేట్రం చేసింది. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఈ సీనియర్ హీరో ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తానే డైరెక్టర్గా మారి కుమార్తెను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా అది హిట్టవ్వలేదు. ఇప్పుడు హీరో ఉపేంద్ర అన్న కొడుకుతో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.
ఇక ఉమాపతి 2017లో అడగపట్టదు మగజనంగాలేతో అరంగేట్రం చేశాడు. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షో సర్వైవర్‌లో కనిపించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
ALSO READ:- ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్
రీసెంట్ గా (అక్టోబర్ 25)న విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్న విషయం తెలిసిందే.