Bigg Boss Elimination: హౌజ్లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్లో మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్!

Bigg Boss Elimination: హౌజ్లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్లో మారిన ఎలిమినేషన్ కంటెస్టెంట్!

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) వాడి వేడిగా జరుగుతోంది. బిగ్బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. ఈసారి లిమిటే లేకుండా.. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్కు హామీ ఇచ్చేసిన.. ట్విస్టులు కూడా అదే లెవల్లో ఇస్తూ వస్తున్నాడు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

బిగ్బాస్ తెలుగు 8 ఐదోవారం సాధారణ ఎలిమినేషన్‌తో పాటుగా మిడ్ వీక్ ఎలిమినేషన్‌ ఉంటుందనే నాగ్ ఆదివారం (సెప్టెంబర్ 29) ఎపిసోడ్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే  హీరో ఆదిత్య ఓం (Aditya Om) మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

అయితే, ముందుగా మిడ్ వీక్‌ డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్లో నైనిక, ఆదిత్య ఓం ఉండగా.. ఇందులో నైనికా ఎలిమినేట్ అవుతుందనే  ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఇక్కడ ఊహించని ట్విస్ట్ జరిగి.. ఆదిత్య ఓం ఎలిమినేషన్తో వీరి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చినంత పనైంది.

ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ చూసుకుంటే.. ఐదో వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నైనిక, నాగ మణికంఠ,  నిఖిల్ ఇలా మొత్తం 6 మంది ఉన్నారు. వీరిలో డేంజర్ జోన్ లో ఉన్న చివరి ఇద్దరు కంటెస్టెంట్స్లో..ఈ వారం మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నారనే విషయం కూడా జోరుగా సాగుతూ వచ్చింది.

వీరిలో 'నబీల్' బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్‌లో వెళ్లగా.. సెకండ్ ప్లేస్ లో 'నిఖిల్' ఉన్నారు. కాగా చివరి రెండు స్థానాల్లో అనగా.. ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా ఆదిత్య ఓం, నైనిక నిలిచారు. ఇక ఆదిత్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎలిమినేషన్కి సంబంధించిన షూటింగ్ బుధవారం (అక్టోబర్ 2) జరిగింది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను గురువారం అంటే ఇవాళ (అక్టోబర్ 3) స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.