Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా

Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి.అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి.అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.

టాలీవుడ్ టాప్ బ్యానర్..స్టార్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలుగా వ్యవహరించనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)టైటిల్ తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గుడ్ బ్యాడ్ అగ్లీ  అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తోన్న అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

టైటిల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పినట్టుగానే అజిత్ని మూడు విభిన్న షేడ్స్‌తో చూపిస్తున్నారు.ఈ పోస్టర్ లో అజిత్ గ్రీన్ ప్రింటెడ్ చొక్కా ధరించగా దానిపై డ్రాగన్ ఆకారాలు ఉన్నాయి.టేబుల్‌పై చాలా రకాలైన మారణాయుధాలు..చేతిపై డ్రాగన్ టాటూలు,డ్రాగన్ ఆకారపు బ్రాస్‌లెట్‌ని చూస్తే..డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) స్టైల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025లో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆయన విడముయార్చి అనే సినిమా చేస్తున్నారు.షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.ఈ రెండు సినిమాల తరువాత అజిత్, గోపీచంద్ మలినేనితో సినిమా ఉండనుందని సమాచారం.