తమిళ స్టార్ అజిత్ కుమార్(Ajith kumar) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విదాముయార్చి (VidaaMuyarchi). దర్శకుడు మగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం అజిత్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నా
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం హీరో అజిత్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. కానీ, ఈ ప్రమాదంలో అజిత్‌కు ఏమి కాలేదని వెల్లడించారు మేకర్స్.
Bravery knows no bounds! 💪 Witness Ajith Kumar's fearless dedication as he takes on a daring stunt sequence in #VidaaMuyarchi without any stunt double. 🫡 🔥#AjithKumar pic.twitter.com/62NyEG4cvG
— Lyca Productions (@LycaProductions) April 4, 2024
అయితే ఆ వీడేమో చూసిన ఫ్యాన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయితే.. ఈ వీడియో 5 నెలలు కిదటిదని, ఆ ప్రమాదం నుండి అజిత్ ఎలాంటి గాయాలవకుండా బయటపడ్డారని తెలుస్తోంది. గతంలో మంకత్తా(తెలుగులో గ్యాంబ్లర్) సినిమా కోసం కూడా ఇలాగె డూప్ లేకుండా డిజెనరేస్ బైక్ రైడింగ్ స్టంట్స్ చేశాడు అజిత్. ప్రస్తుతం అజిత్ ప్రమాదానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.