హీరో అజిత్కు కేంద్రం కీలక బాధ్యత

హీరో అజిత్కు కేంద్రం కీలక బాధ్యత

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు అప్పగించింది. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో మరింత నిఘా పెంచేందుకు  డ్రోన్స్ ఏర్పాటుపై ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్స్ ను తయారు చేసే బాధ్యతను కేంద్ర రక్షణ శాఖ హీరో అజిత్ కు ఇచ్చింది. 

MITలో ఏరోస్పేస్‌ రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ గ్రూప్ పేరు దక్ష. ఆ స్టూడెంట్స్ తో  కలిసి అజిత్‌ డ్రోన్‌ ట్యాక్సీ, డ్రోన్‌ అంబులెన్స్‌ను తయారు చేశాడు. అధిక బరువును అతి తక్కువ సమయంలో టార్గెట్‌కు చేర్చేలా ఈ డ్రోన్‌లను రూపొందించారు. ఇవి ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పోటీలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు బ్లడ్, మెడిసిన్ అందజేశాయి. దీంతో ఆ డ్రోన్‌కు 2019 లో భారత డ్రోన్‌ ఒలింపిక్స్‌లో తొలి బహుమతి వచ్చింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అందించే అబ్దుల్‌ కలాం అవార్డును అజిత్‌కు అందించింది.

అజిత్ తయారు చేసిన డ్రోన్లు కొవిడ్‌ సమయంలో తమిళనాడులో బాగా ఉపయోగపడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పెట్రోల్‌తో నడిచే డ్రోన్ అరగంటలో ఎకరం విస్తీర్ణంలో రసాయనాలను చల్లుతుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ డ్రోన్ల సాయంతో కరోనా సమయంలో రసాయనాలు చల్లేందుకు ఉపయోగించింది. దీంతో ఈ దక్ష టీమ్ తయారు చేసిన డ్రోన్ల గురించి తెలుసుకున్న భారత రక్షణ శాఖ.. సరిహద్దుల్లో నిఘా డ్రోన్ల కోసం అజిత్‌ను సంప్రదించింది. ఏడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్టును అజిత్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ.170 కోట్లు. ఈ దక్ష టీమ్ రూపొందించిన డ్రోన్లను భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో నిఘాకోసం, విపత్తుల్లో సహాయక కార్యక్రమాల కోసం భారత రక్షణ శాఖ వినియోగించనుంది.