కారు రేసింగ్‎లో హీరో అజిత్‎కు ప్రమాదం.. 180 కిలోమీటర్ల స్పీడ్ తో గోడను ఢీకొట్టింది..!

కారు రేసింగ్‎లో హీరో అజిత్‎కు ప్రమాదం.. 180 కిలోమీటర్ల స్పీడ్ తో గోడను ఢీకొట్టింది..!

తమిళ స్టార్ హీరో అజిత్‌‎కు ప్రమాదం జరిగింది. దుబాయ్‎లో రేసింగ్ ట్రాక్‎పై ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న సైడ్ వాల్‎ను బలంగా ఢీకొట్టింది. 180 కిలో మీటర్ల స్పీడ్‎తో దూసుకెళ్లి అజిత్ కార్ సైడ్ వాల్‎ను ఢీకొట్టి కుదుపునకు లోనైంది. కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో అజిత్‎కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో హీరో బయటపడ్డాడు. అజిత్‎కు ప్రమాదం జరిగిందన్న వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. 

దీంతో అజిత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ప్రమాదంలో అజిత్‎కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు, హీరో  కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే రేసింగ్ ఛాంపియన్‌షిప్‌కు ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై హీరో అజిత్ కానీ, ఆయన టీమ్ కానీ అధికారికంగా స్పందించలేదు. 

హీరో అజిత్‎కు బైక్ రేసింగ్, కార్ రేసింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో రేసింగ్ సీన్లలో డూప్ లేకుండా ఆయనే యాక్ట్ చేస్తారు. సినిమా షూటింగ్‎లు లేకపోతే అజిత్ చేసే పని లాంగ్ డ్రైవ్స్, రేసింగ్ మాత్రమే. కొన్నిసార్లు షూటింగ్ ఉన్న సరే రేసింగ్లకు వెళ్తుంటారు అజిత్. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లోనూ అజిత్ పార్టిసిపేట్ చేస్తుంటారు. 

ఈ క్రమంలోనే రాబోయే రేసింగ్ ఛాంపియన్‌షిప్‌కు దుబాయ్‎లో ప్రాక్టీస్ చేస్తోండగా ఈ దుర్ఘటన జరిగింది. దుబాయ్‌లో అజిత్ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. తమ అభిమాన నటుడు ప్రాణపాయం నుండి తప్పించుకోవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.