ఆరు అంటే 6 గంటల్లో.. ఇంట్లో నుంచి జైలుకు.. అల్లు అర్జున్ టైం లైన్ ఇలా..!

ఆరు అంటే 6 గంటల్లో.. ఇంట్లో నుంచి జైలుకు.. అల్లు అర్జున్ టైం లైన్ ఇలా..!

ఏ నిమిషానికి ఏం జరుగునో.. ఎవరు ఊహించిదెరు అన్న సామెత అల్లు అర్జున్ విషయంలో మరోసారి నిజం అయ్యింది. 2024, డిసెంబర్ 13వ తేదీ అల్లు అర్జున్ జీవితంలో ఊహించని మలుపు. ఉదయం ఇంట్లో హ్యాపీగా ఉన్న అల్లు.. మధ్యాహ్యానికి సీన్ మారిపోయింది. జీవితమే రివర్స్ అయ్యింది. జస్ట్ ఆరు అంటే 6 గంటల్లోనే.. ఇంట్లో ఉన్న అల్లు.. ఏకంగా చంచల్ గూడ జైలుకు వెళ్లిపోయారు. విధి ఎంత చిత్రమైంది.. టైం ఎంత బలమైనదో తెలుస్తుంది.

అల్లు అర్జున్ అరెస్ట్ టైమ్ లైన్

  • 11.45AM –  జూబ్లీహిల్స్‌‎లోని అల్లు అర్జున్‌ ఇంటికెళ్లిన పోలీసులు
  • 12PM – సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్‌ చేస్తున్నామని అల్లుఅర్జున్‌కి చెప్పిన పోలీసులు
  • 12:10PM – బెడ్రూమ్‌లోకి వచ్చేస్తారా అంటూ పోలీసులపై బన్నీ అసహనం
  • 12:15PM – అల్లు అర్జున్‌ అరెస్టు
  • 12:20PM – జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి తరలింపు
  • 1PM – చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్‌ తరలింపు
  • 1:15PM – రిమాండ్‌ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు
  • 1:30 PM– బన్నీ అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున పీఎస్ దగ్గరికి ఫ్యాన్స్
  • 2:10 PM– చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలింపు
  • 2:15 PM– గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్‎కి వైద్య పరీక్షలు
  • 2:50 PM– గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తి
  • 3:00 PM– గాంధీ ఆసుపత్రి నుండి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలింపు
  • 5:00 PM నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‎పై విచారణ
  • 5:10 PM అల్లు అర్జున్‎కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • 5:20 PM  నాంపల్లి కోర్టు నుండి బన్నీని చంచల్ గూడ జైలుకు తరలింపు
  • 5:55 PM చంచల్ గూడ  జైలుకు వెళ్లిపోయిన అల్లు అర్జున్

  •