
తెలుగు ప్రముఖ కమెడియన్ సప్తగిరి అడపాదడప హీరోగా కూడా నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఆమధ్య సప్తగిరి నటించిన సప్తగిరి ఎల్ఎల్బి ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.. దీంతో ఈసారి పెళ్లి కానీ ప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా భాను ప్రకాష్ గౌడ్, కేవై బాబు, సుక్క వెంకటేశ్వర గౌడ్ తదితరులు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోమవారం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూద్దాం..
ఈ సినిమాలో హీరో సప్తగిరి ప్రసాద్ అనే యువకుడు పాత్రలో నటించాడు. బలగం సినిమా ఫేమ్ మురళీధర్ గౌడ్ హీరో తండ్రి పాత్రలో నటించాడు. యంగ్ హీరోయిన్ ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా అన్నపూర్ణమ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అయితే హీరో ప్రసాద్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు.
Also Read :- హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తప్పుడు ప్రచారం
కానీ హీరో తండ్రికి కట్నం ఆశ ఎక్కువగా ఉండటంతో ఏళ్ళు గడుస్తున్నా ప్రసాద్ కి పెళ్లి మాత్రం కాదు.. దీంతో హీరో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి.. చివరికి పెళ్ళయిందా లేదా అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే మంచి ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్ జోనర్ ని ఎంచుకున్న సప్తగిరి మళ్ళీ మంచి ఫన్ అందించడానికి రేడే అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మార్చ్ 21న థియేటర్స్ లోకి రాబోతోంది. టీజర్ తో అలరించిన సప్తగిరి థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.