Raayan Twitter Review: రాయన్ ట్విట్టర్ రివ్యూ..హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన రివేంజ్ థ్రిల్లర్‌‌..హిట్టా..ఫట్టా?

Raayan Twitter Review: రాయన్ ట్విట్టర్ రివ్యూ..హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన రివేంజ్ థ్రిల్లర్‌‌..హిట్టా..ఫట్టా?

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘రాయన్’(RAAYAN). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ధనుష్‌‌‌‌ హీరోగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి వీపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

అంతేకాదండోయ్..ఇవాళ రిలీజ్ సందర్బంగా ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాయన్ పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తోన్నారు. తెల్లవారుజామున నుంచి ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే కనిపిస్తుంది. మరి నేడు థియేటర్స్ లోకి వచ్చిన రాయన్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

డైరెక్టర్ గా ధనుష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యారని..ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని..సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందని.. టైటిల్ కార్డ్ సూపర్, ధనుష్ ఎంట్రీ ఊర మాస్ గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంక్ అదిరిపోయిందని, ధనుష్, SJ సూర్యల నటన అద్భుతమని రాసుకొచ్చారు.


"రాయన్ మూవీ రా అండ్ రస్టిక్‌గా ఉంది. ధనుష్ ట్రాన్సర్ఫమేషన్, స్క్రీన్ ప్రజెన్స్ ఒక్కమాటలో చెప్పాలంటే ఫైర్ అంతే. అలాగే ధనుష్ డైరెక్షన్ టాప్ నాచ్‌గా ఉంది. ధనుష్ డైరెక్షన్ టాప్ అవార్డు డైరెక్టర్ వెట్రిమారన్‌ను గుర్తు చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. నటీనటులు పర్ఫామెన్స్ అదిరిపోయింది. ఎస్‌జే సూర్య యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ బీజీఎమ్ సినిమాకు బ్యాక్‌బోన్" అని రాయన్ ఫస్టాఫ్‌పై ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు.

"రాయన్ ఒక సాధారణ రివేంజ్ డ్రామా మూవీ. కానీ, డైరెక్టర్ ధనుష్ తన టేకింగ్‌తో కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ పోర్షన్ అయితే ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. ధనుష్ నటన పీక్స్‌లో ఉంది. కథకు ముఖ్యమైన పాత్రగా హీరో సందీప్ కిషన్ రోల్ ఉంది. ఫస్టాఫ్‌లో ఎస్‌జే సూర్య పాత్రకు చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ అదిరిపోయింది. సెకండాఫ్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ ప్లాట్ ఫస్టాఫ్‌లో ఉంది" అని మరో ఎక్స్ యూజర్ కూడా రాయన్ ఫస్టాఫ్‌పై రివ్యూ ఇచ్చారు.

"మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రాయన్ మూవీకి సెకండ్ హీరో. బ్యాక్ గ్రౌండ్ బీజీఎమ్ మాములుగా లేదు" అని ఇంతకుముందు రివ్యూ ఇచ్చిన నెటిజనే మరోసారి ఇలా రాసుకొచ్చారు. అలాగే ఏఆర్ రెహమాన్ ఫొటోను రాయన్ మూవీ పోస్టర్‌తో పంచుకున్నారు. 

ధనుష్ రాయన్ సినిమాతో ప్రమోషన్స్ బాగా చేసినప్పటికీ ఆడియన్స్ ముందుకు అంతగా రాలేదనే టాక్ రిలీజ్ ముందు వరకు ఉన్నది. కానీ, సినిమాలో ఉన్న కంటెంట్ దెబ్బతో ఆడియన్స్ కి పిక్స్ లో ఎక్కేసింది. ఎక్కడ చూసిన పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోందని ట్విట్టర్ ఆడియన్స్ రెస్పాన్స్ అవుతున్నారు. కాగా.. ఈ రివ్యూ అనేది పబ్లిక్ అభిప్రాయం మాత్రమే. కాసేపట్లో పూర్తి రివ్యూ చూద్దాం.