నయనతార ధనుష్ మధ్య 3 సెకెన్ల వీడియో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ(Beyond The Fairytale)లో వాడుకోవడంతో నయనతార-విఘ్నేష్ శివన్‌లపై హీరో ధనుష్ కేసు దాఖలు చేశారు.
ఈ కేసుపై మద్రాసు హైకోర్టులో ఈరోజు (నవంబర్ 27న) విచారణ జరిగింది. ఈ మేరకు నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై దావా వేసింది. బుధవారం విచారణ సందర్భంగా.. నయనతార, విఘ్నేష్ శివన్ లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ అబ్దుల్ క్విద్దోస్ ఆదేశించారు.
నయన్ ధనుష్ వివాదం:
2022లో నయనతార - విఘ్నేష్ శివన్ చెన్నై మహాబలిపురంలోని స్టార్ హోటల్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహ వీడియో ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ కు భారీ ధరకు ఇచ్చారు. వీరి మ్యారేజ్కి అయిన మొత్తం ఖర్చు రూ.10 కోట్ల కంటే తక్కువే అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్‌కు వివాహ వీడియో ప్రసార హక్కులను రూ.25 కోట్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : కీర్తీ సురేష్ పదిహేన్ల ప్రేమ
ఈ క్రమంలో వీరి పెళ్లి వీడియోలో 'బియాండ్ ది ఫెయిరీటేల్‌లో' 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి నిర్మాత ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా, తగిన అనుమతి లేకుండా 3 సెకన్ల వీడియో వాడారని ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. దాంతో నయన్ తనదైన శైలిలో మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసి ధనుష్పై విరుచుకుపడింది.