డ్రింకర్ సాయి మూవీ యూత్‌‌‌‌ను చెడగొట్టేలా ఉండదు : ధర్మ

డ్రింకర్ సాయి మూవీ యూత్‌‌‌‌ను చెడగొట్టేలా ఉండదు :  ధర్మ

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్  తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన  చిత్రం ‘డ్రింకర్ సాయి’.  ఈనెల 27న  సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ సినిమాలపై ఇంటరెస్ట్‌‌‌‌తో సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నా. కథ విన్నప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యా. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ  ఇది. 

కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం. సాయి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించేందుకు  చాలా మంది డ్రింకర్స్‌‌‌‌ను గమనించాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్‌‌‌‌కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది.- ఇందులో  కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. యూత్‌‌‌‌ను  చెడగొట్టేలా సినిమా ఉండదు. సెకండాఫ్ నుంచి కథ మరో స్థాయికి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్  హార్ట్ టచ్ చేస్తుంది. హీరోయిన్ ఐశ్వర్య శర్మ చాలా ఫోకస్డ్‌‌‌‌గా నటించింది. బాగీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో తన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. మా డైరెక్టర్ కిరణ్ ఎంతో డెడికేషన్‌‌‌‌తో ఈ సినిమాను రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సపోర్ట్‌‌‌‌ మర్చిపోలేనిది’ అని చెప్పాడు.