Kalinga: నాలాంటి కొత్త వ్యక్తి సినిమా తీసి..హిట్ కొట్టడం మామూలు విషయం కాదు: హీరో, డైరెక్టర్ ధృవ వాయు

Kalinga: నాలాంటి కొత్త వ్యక్తి సినిమా తీసి..హిట్ కొట్టడం మామూలు విషయం కాదు: హీరో, డైరెక్టర్ ధృవ వాయు

ధృవ వాయు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కళింగ’.  దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కాగా,  రెస్పాన్స్ తెలియజేసేందుకు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించింది టీమ్. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పాటు డివోషనల్ టచ్ కూడా ఇచ్చి ప్రేక్షకులని మెప్పించారు. 

హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ..'ఇప్పుడు సినిమాలకు ఉన్న పరిస్థితుల్లో నాలాంటి కొత్త వ్యక్తి వచ్చి సినిమా తీయడం, హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. వర్డ్‌ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ చేరువ అవుతోంది. మా సినిమాలో విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా ప్రతి అంశం గురించీ ఆడియన్స్‌ని మాట్లాడుకుంటున్నారు. అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం. కంటెంట్‌ ఉన్న సినిమాను ఆడియన్స్‌ కచ్చితంగా హిట్‌ చేస్తారు. ఈ సినిమాతో అది రుజువైంది.’ అని చెప్పారు. 

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. కళింగ సినిమా మీద మా డైరెక్టర్ ముందు నుంచి నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు విజయం తీసుకొచ్చింది. టెక్నికల్‌గా మూవీ చాలా బాగుందని అందరూ అంటున్నారు అని తెలిపారు. సినిమాను ఆదరిస్తున్న ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు థ్యాంక్స్ చెప్పారు నిర్మాతలు.

హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ..సినిమా చూసాక అందరూ నన్ను సినిమాలోని క్యారెక్టర్ పేరు పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడేళ్లుగా ఈ సినిమా కోసం పని చేశాను. ఇవాళ సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది..టీమ్ అంతా ప్రెస్ మీట్ పాల్గొన్నారు.