
‘హీరో’ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఇలా ముచ్చటించాడు. సినిమా కెరీర్ ప్రారంభించాక ఇది నా మూడో పుట్టినరోజు. కొవిడ్‌తో సినిమా ఆలస్యమవడంతో సెట్‌లో రెండు బర్త్ డేస్ జరిగాయి. సినిమాకు రెస్పాన్స్ బాగున్నా, సంక్రాంతి సీజన్‌లో రావాల్సినంత ప్రేక్షకులు రాలేదని కొంత డిజప్పాయింట్ అయ్యాను. మార్చిలో పెరుగుతుంది అనుకున్నా కరోనా జనవరిలోనే ఎక్కువైంది. సినిమా కంటే జనం సేఫ్టీ ముఖ్యం కదా అని పెద్దగా ఫీల్ అవలేదు. సినిమా చూశాక నన్ను చూస్తుంటే ప్రౌడ్‌గా ఉందంటూ మహేష్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏదో చెప్పారు కానీ ఇంకేమీ వినపడలేదు (నవ్వుతూ). నటనలో ఆయనే నాకు ఆదర్శం. నా ఫేవరేట్ మూవీ ‘మురారి’. వీలయితే ఆ సినిమా రీమేక్‌లో నటించాలని ఉంది. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా అన్ని జానర్ సినిమాలు చేయాలనుంది. నెక్స్ట్ సినిమాలకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్ నుంచి సెట్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తాను. ఇక శనివారం రాత్రి నడుము నొప్పికి ఫిజియోథెరపీ చేయించుకుని నిద్రపోయాను. ఉదయం లేచేసరికి... ఓ పబ్‌పై పోలీసులు జరిపిన రైడ్‌లో నేను కూడా పట్టుబడ్డట్టు వార్తలు చూశాను. అసలు నా పేరు ఎలా వచ్చిందో తెలియదు. సెలబ్రిటీ లైఫ్‌లో ఉంటే ఇలానే వస్తుంటాయనిపించింది.