టాలీవుడ్ స్టార్ గోపీచంద్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడు. తాజాగా తన కొడుకుతో దిగిన పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తండ్రీకొడుకులు ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ చిరునవ్వులు చిందుస్తున్న ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
గోపీచంద్ హీరోగా కెరీర్ గా మొదలుపెట్టి ఆ తర్వాత విలన్ గా మారాడు. మళ్లీ యజ్ఞం మూవీ హిట్తో హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత సక్సెస్ అవ్వలేదు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే శ్రీవాసు కాంబినేషన్ లో వచ్చిన లౌక్యం, లక్ష్యం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.