స్టార్ హీరో ఇంట్లో పని మనిషిగా మినిస్టర్ కూతురు... ఏం జరిగిందంటే..

స్టార్ హీరో ఇంట్లో పని మనిషిగా మినిస్టర్ కూతురు... ఏం జరిగిందంటే..

ఇప్పుడంటే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల కారణంగా సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గింది కానీ ఒకప్పుడు ఎవరైనా హీరో లేదా హీరోయిన్ ని కలవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. అయితే 90'స్ కాలంలో లవ్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా నటించి అలరించిన బాలీవుడ్ హీరో గోవిందా సినీ ప్రేక్షకులకి సుపరిచితమే. 

అయితే తాజాగా హీరో గోవిందా భార్య సునీత అహూజ అప్పట్లో తన ఇంట్లో జరిగిన ఫ్యాన్ గర్ల్ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. అప్పట్లో ఓ యువతి తన ఇంట్లో పని మనిషిగా చేరిందని కానీ తనకి ఇంటిపనులు చెయ్యడం అస్సలు రాదని తెలిపింది. 

దీంతో ఇంటి పనుల విషయంలో ఒకట్రెండు సార్లు ఆ  యువతిని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పేదని చెప్పుకొచ్చింది. కానీ తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు అలాగే సినిమా షూటింగులకు వెళ్లి వచ్చినపుడు మాత్రం అతడికి కావాల్సిన పనుల్లోసహాయం చెయ్యడానికి ఎక్కువగా మొగ్గు చూపేదట. 

ALSO READ | అలా చేసినందుకు ఫ్యాన్స్ కి సారీ చెప్పిన స్టార్ నటి..

దీంతో యువతిపై అనుమానం వచ్చి అసలు విషయం ఏమిటని అడగ్గా యువతి ఓ ప్రముఖ మినిస్టర్ కూతురని తెలియగానే ఒక్కసారిగా తాము అవాక్కయినట్లు చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తర్వాత తన భర్త ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందని తెలిపింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు గోవిందా ఒకప్పుడు వరుస చిత్రాల్లో హీరోగా నటించాడు.  చివరగా 2019వ సంవత్సరంలో విడుదలైన సికిందర్ రాజా అనే చిత్రంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నాడు.