దివ్య ఖోస్లా(Divya kosla) కుమార్ లీడ్ రోల్‌లో సురేష్ కృష్ణ(Suresh Krishna) తెరకెక్కిస్తున్న చిత్రం హీరో హీరోయిన్(Hero Heroine). ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. జనవరిలో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, శుక్రవారం సెకెండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో మోడ్రన్ లుక్‌లో కనిపించిన దివ్య, ఈసారి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. ఇందులో ఆమె ప్రియదర్శిని అనే హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఇక తెలుగు వెర్షన్‌కు ‘నాయక నాయకి’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు తెలియజేశారు. ఇరవై ఏళ్ల క్రితం ఉదయ్ కిరణ్ కు జంటగా ‘లవ్ టుడే’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది దివ్య ఖోస్లా. ఆ తర్వాత టీ సిరీస్ భూషణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొన్ని మ్యూజిక్ వీడియోస్‌తో పాటు యారియన్, సనమ్ రే చిత్రాలను డైరెక్ట్ చేసింది. మరోవైపు భర్త నిర్మించిన కొన్ని చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించింది. మూడేళ్ల క్రితం ‘సత్యమేవ జయతే 2’తో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆమె, గతేడాది వచ్చిన ‘యారియన్ 2’తో ఆకట్టుకుంది. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ‘హీరో హీరోయిన్’ సినిమాతో తను కెరీర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.