మళ్ళీ కలిసిన శుభలగ్నం జంట... హీరోయిన్ కి మేకప్ మెన్ గా మారిన హీరో జగపతి బాబు..

మళ్ళీ కలిసిన శుభలగ్నం జంట... హీరోయిన్ కి మేకప్ మెన్ గా మారిన హీరో జగపతి బాబు..

మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా.. సెకెండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అలరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో జగపతి బాబు గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే హీరో జగపతిబాబు అప్పట్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తో బాగానే అలరించాడు. ఆ తర్వాత హీరోగా ఆఫర్లు తగ్గిపోవడంతో బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్ళీ విలన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పాజిటివ్, నెగిటివ్ ఇలా తేడా లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.  ఈ మధ్య హీరో జగపతిబాబు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే జగపతిబాబు టీవలే షేర్ చేసిన రీల్ వైరల్ అవుతోంది. 

ఈ రీల్ లో జగపతిబాబు వెటరన్ హీరోయిన్ ఆమని కి మేకప్ మెన్ గా కనిపించాడు. దీంతో ఆమని జగపతి బాబుని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలో గొడుగు సరిగ్గా పట్టు... పౌడర్ సరిగ్గా రాయి..  బేటాలు తీసుకోవడం తెలుసుకానీ మేకప్ సరిగ్గా వెయ్యడం రాదా.? అంటూ డైలాగులతో సరదాగా నవ్వించింది. అయితే జగపతిబాబు కూడా మేడం అంటూ తన మేకప్ మెన్ పాత్రలో జీవించేశాడు.. దీంతో రిల్ చుసిన నెటిజన్లు మళ్ళీ వింటేజ్ కామెడీ అంటూ సరదాగా నవ్వుతున్నారు. అయితే ఈ వీడియోకి జగపతి బాబు "పార్ట్ 1: కోటి రూపాయిలుకి, నా భార్య నన్ను అమ్మేసే ముందు."  అంటూ క్యాప్షన్ పెట్టి గతంలో తామిద్దరూ కలసి నటించిన శుభలగ్నం సినిమాని గుర్తు చేశారు.. 

ఈ విషయం ఇలా ఉండగా నటి ఆమని ఒకప్పుడు హీరోయిన్ గా బాగానే రాణించింది. తన సినీ కెరీర్ లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ తదితర స్టార్ హీరోలతో కలసి నటించింది. అంతేకాదు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే పెళ్ళయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొంతకాలంపాటూ దూరమైంది. ఆ తర్వాత ఇటీవలే మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో బాగానే రాణిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)