టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే దగ్గరయ్యాడు. అప్పట్లో ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేశాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ గా నటించి తన నటనతో ఇప్పటికీ అభిమనులని ఎంతగానో అలరిస్తున్నాడు జగపతి బాబు.
ఇటీవలే జపాన్ కి చెందిన ఓ యువతి జగపతి బాబు కి వీరాభిమాని. దీంతో ఏకంగా జపాన్ నుంచి జగపతి బాబుని కలిసేందుకు ఇండియా వచ్చింది. అంతేకాదు జాగాపతి బాబు కి స్పెషల్ గా తయారు చేసిన కొన్ని హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. ఇందులో కవితలు, వస్తువులు, ఫోటోలు, లెటర్లు ఇలా మరిన్ని వస్తువులు ఉన్నాయి.
దీంతో జగపతి బాబు ఈ గిఫ్ట్స్ చూసి హర్షం వ్యక్తం చేశాడు. అలాగే అభిమానం దేశాలు దాటి తన కోసం వచ్చిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇటువంటి గొప్ప అభిమానులు ఉండటం నిజంగా తన అదృష్టమని పేర్కొన్నాడు. ఒక నటుడుకి అభిమనులే గొప్ప ఆస్తులని కితాబిచ్చాడు. ఇక తన అభిమానితో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ తన అభిమాని పేరు యూజీకీ అని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా నటుడు జగపతిబాబు నటించిన పుష్ప 2 సినిమా ఇటీవలే రిలేజ్ కాగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాలో జగపతిబాబు సెంట్రల్ మినిస్టర్ పాత్రలో నటించాడు.