బింబిసారగా క‌‌ళ్యాణ్ రామ్..

  • బింబిసార ఈవిల్ టు గుడ్

జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫ‌‌రెంట్ కాన్సెప్టులు ట్రై చేసే క‌‌ళ్యాణ్ రామ్, ఈసారి పీరియాడిక్ మూవీని ఎంచుకున్నాడు. త‌‌న తాతగారు ఎన్టీఆర్ జయంతి సంద‌‌ర్భంగా ఈ కొత్త చిత్రం ఫ‌‌స్ట్ లుక్‌‌ని, టైటిల్ మోష‌‌న్ పోస్ట‌‌ర్‌‌‌‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌‌ని ఖ‌‌రారు చేశారు. ‘ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్‌‌ లైన్. వ‌‌శిష్ట్​ ద‌‌ర్శ‌‌కుడిగా ప‌‌రిచ‌‌యమవుతున్నాడు. క‌‌ళ్యాణ్ రామ్ సొంత బ్యాన‌‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌‌పై కె.హ‌‌రికృష్ణ  నిర్మిస్తున్నాడు. మునుపెన్న‌‌డూ క‌‌నిపించ‌‌నంత డిఫ‌‌రెంట్ లుక్‌‌లో బార్బేరియ‌‌న్ కింగ్ బింబిసార‌‌గా క‌‌నిపిస్తున్నాడు క‌‌ళ్యాణ్ రామ్. యుద్ధ రంగంలో శత్రు సైనికుల‌‌ను చంపి, వారి శ‌‌వాల‌‌పై ఠీవిగా కూర్చుని ఉన్నాడు. త‌‌న లుక్, బ్యాక్‌‌డ్రాప్‌‌ అన్నీ కొత్త‌‌గా ఉన్నాయి. క‌‌ళ్యాణ్ రామ్ కెరీర్‌‌‌‌లోనే భారీ బ‌‌డ్జెట్, హై టెక్నిక‌‌ల్ వేల్యూస్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోయినేడు షూటింగ్ ప్రారంభ‌‌మైంది. క‌‌రోనా కార‌‌ణంగా బ్రేక్ ఇచ్చామ‌‌ని, ఈ యేడు సెకెండాఫ్‌‌లో రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నామని యూనిట్ చెప్పింది. క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీన‌‌న్ హీరోయిన్స్. చిరంత‌‌న్ భ‌‌ట్ సంగీతం అందిస్తున్నాడు.  క్రీస్తు పూర్వం ఐదో శ‌‌తాబ్ధానికి చెందిన మ‌‌గ‌‌ధ చక్రవర్తే ఈ బింబిసారుడు. ప‌‌దిహేనేళ్ల వ‌‌య‌‌సులోనే సింహాస‌‌నం ఎక్కి దాదాపు యాభయ్యేళ్లు ప‌‌రిపాలించిన‌‌ట్టు చరిత్ర పుస్త‌‌కాల్లో ఉంది. బుద్ధుడికి ముఖ్య‌‌మైన శిష్యుడు కూడానని బౌద్ధ సూత్రాలు చెబుతున్నాయి. జైన మ‌‌త గ్రంథాల‌‌లోనూ ఆయ‌‌న ప్ర‌‌స్తావ‌‌న ఉంది. మ‌‌రి ఈ సినిమా బింబిసారుడి చరిత్ర‌‌కి సంబంధించిన సినిమానా లేక ఏదైనా ఫిక్ష‌‌నల్‌‌ స్టోరీనా అనేది తెలియాల్సి ఉంది.