Hero Karthi: నేనేమీ తప్పుగా మాట్లాడలేదు పవన్ సార్.. అయినా సారీ : హీరో కార్తీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోమవారం (సెప్టెంబర్ 23న) జరిగిన సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూపై హీరో కార్తీ మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు.. ఏదైనా మాట్లాడే ముందు..ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి " అంటూ ఫైర్ అవ్వగా..తాజాగా హీరో కార్తీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 

"ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు..నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను. శుభాకాంక్షలు..." అంటూ ట్విట్టర్ X ద్వారా కార్తీ తెలిపారు.  

కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ (Satyam Sundaram).  సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.