HIT3: నాని HIT-3లో కోలీవుడ్ స్టార్ హీరో.. అంచనాలు పెంచేస్తోన్న కొత్త అప్డేట్!

HIT3: నాని HIT-3లో కోలీవుడ్ స్టార్ హీరో.. అంచనాలు పెంచేస్తోన్న కొత్త అప్డేట్!

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌’.శ్రీనిధి శెట్టి హీరోయిన్. డాక్టర్ శైలేష్ కొలను దీనికి దర్శకుడు. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా మే 1న సినిమా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ బుజ్ వినిపిస్తోంది. హిట్ 2 క్లైమాక్స్ లాగానే “హిట్ 3” క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అది కూడా తమిళ స్టార్ హీరో కార్తీ అని టాక్ ఉంది.

కార్తీ ఎంట్రీ హిట్ 4 కి లీడ్ ఇచ్చేలా ఉంటుందని.. అందుకు ఒక పవర్ ఫుల్ కథాంశం తోడవుతుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే హిట్ 2లో నాని ఎంట్రీ మాదిరిగా.. డైరెక్ట్ HIT3 రిలీజ్ అయ్యాకనే కార్తీ రివీల్ అవ్వనున్నట్లు మారో టాక్. అయితే, ఈ లేటెస్ట్ అప్డేట్ నాని మరియు కార్తీ ఫ్యాన్స్లో జోష్ పెంచుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

హిట్-3’లో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. విపరీతమైన కోపంతో తాండవం చేస్తున్న నాని సీన్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. అలాగే, ఇటీవలే 'ప్రేమ వెల్లువ' అంటూ సాగే పాట రిలీజై శ్రోతలను అలరిస్తుంది. ఇందులో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టిల అందమైన ప్రేమ ప్రయాణాన్ని పొందుపరిచారు. 

ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.