అసలు పేరు కార్తిక్ తివారి. చదివింది బి.టెక్ బయో టెక్నాలజీ. ప్రొఫెషన్ పరంగా యాక్టర్, మోడల్. కార్తిక్ నాన్న మనీష్ తివారి, పిడియాట్రిషన్. అమ్మ మాల, గైనకాలజిస్ట్. చెల్లి పేరు కిట్టు.. తను కూడా డాక్టరే. పదో తరగతిలోనే యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు కార్తిక్. కట్ చేస్తే... ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో మొదటి సినిమా పట్టాలెక్కింది. ఆ మూవీ షూటింగ్ టైంలో పన్నెండుమంది రూమ్ మేట్స్‌తో కలిసి ముంబైలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లో ఉండేవాడు. అటు సక్సెస్, ఇటు ఫెయిల్యూర్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగాడు. అతనే బాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ ‘ధమాకా’ హీరో కార్తిక్ ఆర్యన్. సక్సెస్ఫుల్, ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి తన మాటల్లోనే...
‘‘ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాక్టర్ అవ్వాలనేది నా కల. ధమాకా సినిమా నాకు ఆ అవకాశం ఇచ్చింది. నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అది. స్ర్కిప్ట్ చదివినప్పుడు ఇదే ఫీలయ్యాను. గ్రే క్యారెక్టర్ చేస్తున్నా.. ఫ్యాన్స్‌కి నచ్చుతుందో లేదో అని భయపడ్డా. కానీ, రిజల్ట్ చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యా.
ధమాకా రికార్డ్ టైంలో కంప్లీట్ చేసిన ఫిల్మ్ అనిపించింది. ప్యాండెమిక్లో పక్కాగా ప్లాన్ చేసుకుని, ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ఫుల్ వింగ్ బుక్ చేసింది మూవీ టీం. అదంతా చాలా కష్టమనిపించింది. కానీ, ఆ ప్రాసెస్‌ని కూడా చాలా ఎంజాయ్ చేశాం. చుట్టూ కెమెరాలు పెట్టి లాంగ్ షాట్లో సీన్స్ తీశారు. దాని కోసం క్యారెక్టర్ని మైండ్‌లో ఉంచుకుని.. నన్ను నేను చాలా ప్రిపేర్ చేసుకున్నా. క్యారెక్టర్ గురించి స్టడీ చేయడానికి, డాక్యుమెంటరీలు చూడ్డానికి, జర్నలిస్ట్‌ల లైఫ్ గురించి స్టడీ చేయడానికి లాక్ డౌన్లో ఛాన్స్ దొరికింది.
ఒకేసారి నాలుగు సినిమాలు
నేను ఎక్కువగా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాంటి నాకు ఒకేసారి నాలుగు సినిమాలు చేసే అవకాశం రావడంతో నా కల నెరవేరింది అనిపిస్తోంది. ఆ సినిమాల ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా టాలెంటెడ్. నాకు ఎప్పుడు, ఏం చేయాలనే ప్లానింగ్ ఉంది. దాని ప్రకారమే అన్నీ చేస్తుంటా. ‘సోనూ కె టిటు కి స్వీటీ’ మూవీ సక్సెస్ సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అదే నాకిప్పుడు ఎలాంటి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలనే ఆలోచన, అవగాహన రావడానికి కారణం. దానివల్లే ‘పతి పత్ని ఔర్ ఓ’, ‘సోనూ కె టిటు కి స్వీటీ’, ‘లుకా చుప్పి’ సినిమాలు సక్సెస్ అయ్యాయి అనుకుంటా. ఆడియెన్స్‌కి ఈ కథ నచ్చుతుంది అనే బలమైన నమ్మకంతో నేను ఆ సినిమాల్లో యాక్ట్ చేశా.
డ్రీమ్ కోసం..
బయటి నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా.. సరైన దారిలో వెళ్లాలంటే ఆ దారిలో తీసుకెళ్లడానికి సరైన మనుషుల్ని కలవాలి. హార్డ్ వర్క్ చేసుకుంటూ, సరైన టైం కోసం ఎదురు చూడాలి. నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నేను గ్వాలియర్ అనే చిన్న సిటీ నుంచి వచ్చా. నా డ్రీమ్ గురించి నా పేరెంట్స్‌ని ఒప్పించడం చాలా కష్టమైన పని. నేను స్టడీస్ కంప్లీట్ చేయకుండా ఇండస్ట్రీకి వెళ్లాలంటే ఎవరూ నన్ను ముంబై పంపరు. అందుకని, నేను నవీ ముంబైలోని డి.వై. పాటిల్ కాలేజీలో చేరా. అలా ముంబైలో జరిగే ఆడిషన్స్‌కి వెళ్లొచ్చనేది నా ఆలోచన. ఆడిషన్స్ గురించి ఫేస్ బుక్‌లో నేర్చుకున్నా. రోజు మార్చి రోజు భేలాపూర్ నుంచి అంధేరికి లోకల్ ట్రైన్లో వెళ్లాలంటే చాలా కష్టమనిపించేది. స్టేషన్‌లోని వాష్‌రూంలో బట్టలు మార్చుకుని వెళ్లేవాడిని. దాదాపు మూడేండ్లు అదే నా రొటీన్. అప్పుడే నేను ఒక ఆడిషన్‌కి వెళ్లా. అక్కడ ఒక వ్యక్తి కలిశాడు. యాక్టింగ్ స్కూల్ గురించి చెప్పాడు. దాంతో నేను యాక్టింగ్ స్కూల్లో చేరా. గంటలు గంటలు క్యూలో నిలబడి ఆడిషన్స్ ఇచ్చేవాడ్ని. అందరి ముందు ‘నువ్వు దీనికి సరిపోవు. వెళ్లు’ అనేవాళ్లు. అప్పుడు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. ఒక కాస్టింగ్ డైరెక్టర్ ‘ఇతను అస్సలు పనికి రాడు’ అన్నాడు. తర్వాత ఒకసారి కలిసినప్పుడు ‘నా మాట తప్పు అని ప్రూవ్ చేశావ్’ అన్నాడు.
సోషల్ మీడియా ద్వారా
‘ప్యార్ కా పంచ్‌నామా’ ఆడిషన్స్ ఫేస్బుక్లో చూశా. అప్పుడు పోర్ట్ ఫోలియో కోసం కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అందుకని నేను నా కాలేజీ ఆల్బమ్‌లో ఫొటోలను క్రాప్ చేసి, పంపించా. ఆడిషన్స్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. ఆరు నెలల తర్వాత నామాలో యాక్ట్ చేయడానికి సెలక్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమానే వైరల్ అయింది. ఫేస్బుక్లో ట్రెండ్ అయింది. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు యాక్సిడెంట్ అయింది. నేను వెళ్తున్న ఆటో బోల్తాపడింది. దాంట్లో నా కాలు ఇరుక్కుపోయి, చాలా పెద్ద గాయమైంది. ఎవరో వచ్చి నన్ను సైకిల్ మీద హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు నేను ఈ సినిమా పోతుందని మా అమ్మ దగ్గర ఏడ్చా. ఒకరోజు రాత్రి సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు నన్ను చూడ్డానికి వచ్చారు. వాళ్లని చాలా వేడుకున్నా. దాంతో వాళ్లు కూడా నాకోసం వెయిట్ చేశారు.
ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియక...
నా కెరీర్ మొదట్లో ఫెయిల్యూర్ చూశా. ‘ఆకాశ్ వాణి’ చాలా మంచి సినిమా. నా మనసుకు నచ్చింది. అదెందుకు వర్కవుట్ కాలేదో నాకు తెలియదు. తర్వాత ‘కాంచి’ ఫ్లాప్ అయింది. దాంతో నాకు మళ్లీ అవకాశాలు రావేమోనని భయం పట్టుకుంది. డిప్రెషన్లోకి వెళ్లా. ‘ప్యార్ కా పంచ్‌నామా 2’ మీదే ఆశలు పెట్టుకున్నా. అది కూడా పోయి ఉంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడ్ని కాదేమో. ఏం లేకుండా ముంబై వచ్చా కదా. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ‘ప్యార్ కా పంచ్‌నామా2’ తర్వాత కూడా ఓపెన్ ఆడిషన్స్‌కి వెళ్లా. అందరూ నాతో ఫొటోలు తీసుకున్నారు. కానీ ఆ ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యా.
ఒత్తిడి అవసరం
ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. నేను ఈరోజు ఈ ప్లేస్‌లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టు చేయాలనే తపన ఉంటుంది. సినిమాల మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ప్రెజర్‌ని ఫ్యూయల్‌గా మార్చుకుంటా నేను. నా లైఫ్‌లో ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి అని కోరుకుంటా. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాకే వర్క్ దొరికింది నాకు. అందుకని ఆ స్ట్రగుల్స్‌లో పోయిన టైంని కూడా కవర్ చేయాలనుకుంటున్నా. నా లైఫ్‌లో చిన్న పాటి సక్సెస్ కూడా నాకెంతో పాజిటివ్నెస్ ఇస్తుంది. నాకు వర్క్ లేనప్పుడు నేను ఒత్తిడికి లోనవ్వలేదు. అలాంటప్పుడు ఇప్పుడెందుకు స్ట్రెస్ ఫీలవ్వాలి. అందుకే నేనెప్పుడూ హ్యాపీగా ఉంటా.
నేను కన్న కలలోనే జీవిస్తున్నా. నన్ను నేను రివైండ్, రిఫ్రెష్ చేసుకోవడానికి విడిగా టైం అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అందుకే మూవీ కోసం వేరే ప్లేస్‌లకు వెళ్లినప్పుడు కూడా చుట్టుపక్కల తిరుగుతా. కనిపించిన వాళ్లతో మాట్లాడి, స్ట్రీట్ ఫుడ్ తింటా.
సక్సెస్ సెలబ్రేషన్
నా సెలబ్రేషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. దగ్గరివాళ్లతో స్పెండ్ చేయడం, ఫేవరెట్ ఫుడ్ తినడం, మ్యూజిక్ వింటూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం. నేను ఫ్యామిలీ పర్సన్‌ని. చాలా ఎమోషనల్. నా డ్రీమ్ కారు ఇంటికి వచ్చినప్పుడు. సంతోషంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆ కార్లో నా ఫ్యామిలీని ఎక్కించుకుని డ్రైవ్‌కి వెళ్లా. ఆ క్షణం చాలా హ్యాపీగా అనిపించింది. కారు కల నెరవేరింది. ఇప్పుడేమో సొంతగా ప్రైవేట్ జెట్ ఒకటి కొనాలనుకుంటున్నా.
మారలేదు
నేను స్కూల్, కాలేజీల్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. కొంచెం కూడా మారలేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటా. అలా ఉండటం వల్ల నాకు కూడా ఎనర్జీ డబుల్ అవుతుంది. నేను ఎంతోకాలంగా సినిమాలు చేస్తున్నా... నా పేరు ఎవరికీ తెలియదు. ‘సోనో కె టిటు కి స్వీటీ’ సినిమా సక్సెస్ తర్వాత నుంచి నన్ను నా పేరుతో పిలుస్తున్నారు. అప్పుడు... ఏదో మార్పు వచ్చిందని రియలైజ్ అయ్యా. నిజం చెప్పాలంటే జనాలు నన్నేమంటున్నారనేది పట్టించుకోను. నేను ప్రతి రోజూ పని చేస్తున్నా.. అది చాలు. పేరు, డబ్బు, హోదా అవన్నీ తర్వాత వచ్చాయి. ఎన్ని ఉన్నా ఆడియెన్స్ ప్రేమే నాకు వ్యాల్యుబుల్. నేను నెగెటివిటీకి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను ఒక చిన్న సిటీ నుంచి పెద్ద కలతో ఇక్కడికి వచ్చాను. నా కలల గురించే ఆలోచించేవాడ్ని. ఫ్యాన్స్ పొగడ్తలు, ప్రేమ మాత్రమే తీసుకుంటా. వాళ్లు నాతో కనెక్ట్ అయ్యారు. నా జర్నీలో వాళ్లని చూసుకుంటున్నారు అనుకుంటా.
సక్సెస్‌ని మైండ్‌కి, ఫెయిల్యూర్ని హార్ట్‌కి తీసుకోకూడదు. కొత్త రోజు వస్తుంది. అప్పుడు అన్నీ మారిపోతాయి. ఆశ వదులుకోవద్దు. ఆగిపోవద్దు. హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. దాని వెనకే సక్సెస్ వస్తుంది. ఈ క్షణం నాకున్న దాన్ని చూసి నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటున్నా. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నన్నెప్పుడూ మార్చదు. మర్యాదగా నడుచుకోవాలని నాకు నేను ఎప్పుడూ చెప్పుకుంటా.
అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్
అమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానిక్కారణం మా అమ్మానాన్నలే. వాళ్ల ఆశీర్వాదం, సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. నేను హీరో అయ్యాకాబట్టి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేం ఉండదు మా అమ్మకు. ఇప్పటికీ చెప్పిన టైంకి ఇంటికి వెళ్లకపోతే పది సార్లు ఫోన్ చేస్తుంది. నేను ఇంటికి వెళ్లే వరకు నిద్ర పోదు.
నేను సెకండ్ హ్యాండ్ కారు కొన్నా. కారు పైన డ్యామేజ్ అయింది. వర్షం పడితే నీళ్లు పీల్చుకుంటుంది. ఎప్పుడైనా పార్టీలకి వెళ్తే ఆ కారుని దూరంగా పార్క్ చేసేవాడ్ని. కొన్నిసార్లు పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బుల్లేక ఆటోలో వెళ్లే వాడ్ని. ఆ రోజుల్ని మర్చిపోలేను. మూడు గంటల సినిమా చూసి ఆడియెన్స్ రెస్పాన్స్ లేకపోయినా బాధపడను. ఇంకా కష్టపడాలి అని మోటివేట్ అవుతాను. ఏడేండ్ల తర్వాత ‘సోనూ కె టిటూ కి స్వీటీ’ నాకు సక్సెస్ ఇచ్చింది.
నేను సెకండ్ హ్యాండ్ కారు కొన్నా. కారు పైన డ్యామేజ్ అయింది. వర్షం పడితే నీళ్లు పీల్చుకుంటుంది. ఎప్పుడైనా పార్టీలకి వెళ్తే ఆ కారుని దూరంగా పార్క్ చేసేవాడ్ని. కొన్నిసార్లు పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బుల్లేక ఆటోలో వెళ్లే వాడ్ని. ఆ రోజుల్ని మర్చిపోలేను. మూడు గంటల సినిమా చూసి ఆడియెన్స్ రెస్పాన్స్ లేకపోయినా బాధపడను. ఇంకా కష్టపడాలి అని మోటివేట్ అవుతాను. ఏడేండ్ల తర్వాత ‘సోనూ కె టిటూ కి స్వీటీ’ నాకు సక్సెస్ ఇచ్చింది.