Bhaje Vaayu Vegam OTT: OTTకి వచ్చేస్తున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భజే వాయు వేగం

Bhaje Vaayu Vegam OTT: OTTకి వచ్చేస్తున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భజే వాయు వేగం

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ(Karthikeya) నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam). కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి(Prashanth reddy) తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఫాథర్ సన్ ఎమోషనల్ అండ్ క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు కాస్త డల్ గా స్టార్ట్ అయినా మౌత్ టాక్ తో తరువాత రోజునుండి పుంజుకుంది ఈ సినిమా. 

దాంతో బాక్సాఫిస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. భజే వాయు వేగం సినిమా జూన్ చివరివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక భజే వాయు వేగం సినిమా కథ విషయానికి వస్తే.. కార్తికేయ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. అతడిని తనికెళ్లి భరణి దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాహుల్ టైసన్, కార్తికేయను పెంచి పెద్ద చేస్తాడు. ఓ రోజు తణికెళ్లభరణి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల అవసరం పడుతుంది. అందుకోసం బెట్టింగ్స్ వేస్తారు. కానీ విలన్ గ్యాంగ్  మోసం చేస్తారు. అక్కడి నుండి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.