ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో.. భజే వాయు వేగం

ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో.. భజే వాయు వేగం

కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ  నిర్మించిన చిత్రం ‘భజే వాయు వేగం’. శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు శర్వానంద్ అతిథిగా హాజరై, సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు. కార్తికేయ మాట్లాడుతూ ‘యూవీ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో మూవీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. స్టార్స్‌‌‌‌తో పాటు యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న సంస్థ ఇది. 

ఎమోషన్స్, వాల్యూస్ చూపించే చిత్రమిది. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. సపోర్ట్‌‌‌‌ చేసిన ప్రతి ఒక్కరికీ దర్శకనిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు.  కార్యక్రమానికి హాజరైన దర్శకులు వశిష్ట, మేర్లపాక గాంధీ, క్లాక్స్ చిత్రం విజయం సాధించాలని కోరారు. నటులు తనికెళ్ల భరణి, నాగ మహేష్, సుదర్శన్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.