యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ జోష్ను కంటిన్యూ చూస్తూ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. నేడు సోమవారం (ఫిబ్రవరి 3న) కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు.
ఈ మూవీకి ‘K’ RAMP అనే టైటిల్ ప్రకటిస్తూ 32 సెకన్ల వీడియో రిలీజ్ చేశారు. 'ఈ స్క్రిప్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాం.. గట్టిగా నవ్వించబోతున్నాం' అంటూ మేకర్స్ వీడియోలో తెలిపారు. ఇది కిరణ్ కెరీర్లో 11వ సినిమాగా తెరకెక్కుతోంది. నేడు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్లో నిర్వహించారు.
నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా ఆన్ చేసారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ స్క్రిప్ట్‌ను అందజేశారు. యోగి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా రంగబలి ఫేమ్ యుక్తి తరేజను ఎంపిక చేశారు.
K ర్యాంప్ అంటూ యూత్‌కు తగ్గట్టు ట్రెండ్ క్రియేట్ చేసే టైటిల్ తో వస్తున్నాడు కిరణ్. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన అంటూ సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్న హాస్య బ్యానర్ మీద రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కడుపుబ్బా నవ్విస్తాము అంటూ షూట్కి ముందే మేకర్స్ చెబుతున్నారంటే సినిమాఎలాంటి ర్యాంపేజ్లో ఉండనుందో చూడాలి.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా మూవీ ఫిబ్రవరి 14న లేదా 21న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Very confident about this script. Gattiga navvinchabotunam ❤️#Kramp #Hasyamovies pic.twitter.com/0YPsk79H3k
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 3, 2025